త‌గ్గిన కోవిడ్‌19 కేసులు..

కోవిడ్‌19 వ్యాప్తి అదుపులోకి వ‌చ్చింది.  కరోనా వైర‌స్‌కు కేంద్ర బిందువైన హుబేయ్ ప్రావిన్సులో ఆ వ్యాధి కేసుల న‌మోదు త‌గ్గుముఖం ప‌ట్టింది. చైనా జాతీయ ఆరోగ్య క‌మిష‌న్ ఈ విష‌యాన్ని చెప్పింది. ఎన్‌హెచ్‌సీ ప్ర‌తినిధి మీ ఫెంగ్ ఇవాళ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడారు. వ‌రుస‌గా నాలుగో రోజు  కొత్త‌గా న‌మోదు అవుతున్న కేసులు క‌న్నా..  వ్యాధి న‌య‌మైన కేసులు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపారు.  వుహాన్ న‌గ‌రం త‌ప్ప.. ఈ మార్పు ఆ ప్రావిన్సులో క‌నిపిస్తున్న‌ట్లు చెప్పారు. ప‌టిష్ట‌మైన నియంత్ర‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్ల హుబేయ్ ప్రావిన్సులో కోవిడ్‌19 కేసులు త‌గ్గిన‌ట్లు పేర్కొన్నారు.