రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 17 రాష్ర్టాలకు చెందిన 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుండటంతో షెడ్యూల్ విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 6వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
మార్చి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
16వ తేదీ రోజు నామినేషన్లను పరిశీలిస్తారు.
మార్చి 18వ తేదీ రోజు వరకు నామినేషన్ ఉపసంహరించుకునేందుకు వీలు ఉంటుంది.
మార్చి 26వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
26వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
మార్చ్ 30వ తేదీ లోపు ఎన్నికలు ముగించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణకు చెందిన సభ్యులు కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావుల పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మీ, కె. కేశవరావు, మహ్మద్ అలీ ఖాన్ ల పదవి కూడా ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. రెండు తెలుగు రాష్ర్టాలు కలిపి మొత్తం 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.