ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని బౌద్ధ సమాజం కరోనాపై పోరాటానికి తన వంతు సాయం చేసింది. ఉత్తరాఖండ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.23 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లోని బౌద్ధమత గురువులు హెచ్‌హెచ్ శక్రితాజిన్, హెచ్‌హెచ్ రత్నవజ్ర శక్య, హెచ్‌హెచ్ జ్ఞాన్ వజ్ర శక్య ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌ను కలిసి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన సీఎం.. ఇలా మీ అందరి సహకారం ఉంటే కరోనా మహమ్మారిని త్వరలోనే జయిస్తామని వ్యాఖ్యానించారు. కాగా, ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఉత్తరాఖండ్ సీఎంఆర్ఎఫ్‌కు బౌద్ధుల విరాళం